భారతదేశం, జూన్ 16 -- ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. గతంలో విడుదల చేసిన 299 కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేసింది. అభ్యర్థులకు అత్యంత కీలకమైన టెట్(TET) నిబంధన నుండి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి.శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సవరించిన తాజా నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియతో చాలా మందికి ఉపశమనం దక్కుతుంది.

సాధారణంగా కేజీబీవీల్లో ఉపాధ్యాయ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తప్పనిసరి. అయితే తాజా సవరణ ప్రకారం ప్రస్తుతం టెట్ క్వాలిఫై కాకపోయినా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ మినహాయింపు తాత్కాలికం మాత్రమే అని అభ్యర్థులు ...