భారతదేశం, మే 18 -- Andhra Pradesh aqua sector Crisis : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పందించారు. ఈ సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు.

భారతీయ రొయ్యల ఎగుమతులకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికా.. ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను భారం పడుతోందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు రాసిన లేఖలో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయం...