భారతదేశం, ఆగస్టు 5 -- ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల భద్రత, రక్షణ, వారి సంక్షేమాన్ని పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు - 2026 ముసాయిదా తయారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని మంత్రి ఎన్. మహమ్మద్ ఫరూక్ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఓ ప్రకటనలో మంత్రి ఫరూక్ వివరాలను వెల్లడించారు. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవికి సంబంధిత శాఖలతో చర్చలు జరిపి, ఈ బిల్లు ముసాయిదాను ప్రాధాన్యతా ప్రాతిపదికన సిద్ధం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల హక్కులను కాపాడటానికి, వారి రక్షణ, సంక్షేమాన్ని ని...