ఏపీలో ప్రెగ్నెన్సీ-ప్రెగ్నెన్సీకి మధ్య రెండేళ్ల గ్యాప్ ఇచ్చిన జంటలకు రూ.5000 క్యాష్ ప్రైజ్
భారతదేశం, జూలై 7 -- ప్రసవాల మధ్య సరైన కాల వ్యవధి పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, కుటుంబ నియంత్రణ సేవలను మరింత చేరువ చేసేందుకు జూలై 11 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్త అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
వరుస గర్భధారణల మధ్య కనీసం రెండేళ్ల వ్యవధిని నిర్వహించడం వల్ల తల్లీ, పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ కనీస గ్యాప్ వల్ల మాతృ మరణాలను 30 శాతం వరకు, అలాగే శిశు మరణాలను 10 శాతం వరకు తగ్గించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నగదు బహుమతులను ప్రకట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.