భారతదేశం, అక్టోబర్ 7 -- దేశ రక్షణ వ్యవస్థ లక్ష్యంగా పాకిస్థాన్ నిఘా సంస్థలు పన్నుతున్న కుట్రలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి, భారతీయ రక్షణ దళాల ఉద్యోగులను ఆకర్షించి రహస్య సమాచారాన్ని సేకరిస్తున్న పాక్ ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐసీ) విభాగం విజయవంతంగా ఛేదించింది. ఈ హనీట్రాప్ ఉచ్చులో పడి దేశభద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఓ భారత నావికాదళ ఉద్యోగి సహా ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.

విశాఖపట్నం నావికాదళ కేంద్రం కేంద్రంగా సాగుతున్న ఈ గూఢచర్యాన్ని ఛేదించేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు అక్టోబర్ 1న 'ఆపరేషన్ ఫైర్‌వాల్-2026' పేరుతో భారీ సోదాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ ...