ఏపీలో కొత్తగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతి!
భారతదేశం, జూలై 14 -- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(NMC) తీపి కబురు అందించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 175 ఎంబీబీఎస్(MBBS) సీట్ల భర్తీకి ఎన్‌ఎమ్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 325కు చేరింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా అనుమతుల ప్రకారం సీట్లు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఎన్‌ఎమ్‌సీ అనుమతి ఇచ్చింది. సిద్ధార్థ వైద్య కళాశాల(విజయవాడ)కు అదనంగా మరో 75 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.