ఏపీలో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు: అక్టోబర్ 30న తుది జాబితా
భారతదేశం, అక్టోబర్ 15 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) 2026 ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాలో నమూనా నోటీసుల జారీతో పాటు దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కార గడువును అక్టోబర్ 10 నుంచి 22 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గడువు పొడిగింపు నిర్ణయంతో ఓటర్ల తుది జాబితా ప్రచురణ తేదీ మారింది. అంతకుముందు నిర్ణయించిన అక్టోబర్ 16కు బదులుగా, అక్టోబర్ 30న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు. ఫిర్యాదులు, దరఖాస్తుల పరిశీలనకు అధికారులకు తగిన సమయం కల్పించేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
పరిశీలన ప్రక్రియ గురించి సీఈఓ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. "నోటీసుల జారీ, దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారానికి చివరి తేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.