భారతదేశం, ఫిబ్రవరి 21 -- చిత్తూరు, అన్నమయ్య, ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి ఏవియన్ ఇన్ఫ్లూంజా (బర్డ్ ఫ్లూ ) సోకినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు.
సదరు వ్యక్తి నుంచి సేకరించిన నమూనాను వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ మనుషుల వరకు రాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి 'ఓసెల్టామివర్' మాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.