భారతదేశం, సెప్టెంబర్ 8 -- ​రాష్ట్రంలో వైద్య విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, పరిశోధనలను ప్రోత్సహించడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. పి.చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆవరణలోని సిల్వర్ జూబ్లీ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా సలహాదారు(ఎన్నారై) డా.లోకేష్ ఈదర, ప్రముఖ అనస్థీషియాలజిస్ట్ డా. కె.వి.రావులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వీసీ డా. పులాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సర్వేలు, ఎన్ఐఆర్ఎఫ్ (NIRF), న్యాక్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబరిచాయన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ (AMC) జాతీయ స్థాయిలో 3వ స్థానం, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని...