భారతదేశం, జూలై 15 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. 2026 జూన్ 22న విడుదల చేసిన ఎంపిక నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ తాజా జాబితాను ఏపీపీఎస్సీ కార్యదర్శి జూలై 14, 2026న అధికారికంగా ప్రకటించారు.

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల ఆధారంగా అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేశారు. రాత పరీక్షలు 15.07.2025 నుండి 23.07.2025 వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జరిగాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 20.05.2026 నుండి 29.05.2026 వరకు, 06.07.2026న అభ్యర్...