భారతదేశం, జూలై 13 -- ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా గుర్తింపునిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఇమ్మిగ్రేషన్ కేంద్రాల జాబితాను సవరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాలను ఉపయోగించి.. హోం శాఖ ఈ సవరణలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం దేశంలోని విమానాశ్రయాల విభాగంలో కేటగిరీ-1 కింద 39వ నంబరుగా భోగాపురం విమానాశ్రయాన్ని చేర్చారు. ఈ అధికారిక గుర్తింపుతో భోగాపురం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పుడు విదేశాలకు వెళ్లే, విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల పాస్‌పోర్ట్, వీసా వెరిఫికేషన్ ప్రక్రియలను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇక్కడే పూర్తి చేయడానికి మార్గం సుగమమై...