ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్ - ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ కేంద్రం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో నెలకొన్న అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల గురువారం భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వీటితో పాటు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.