భారతదేశం, అక్టోబర్ 7 -- శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనార్థం వెళ్లే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక బస్సు సేవలు, అద్దె ప్యాకేజీలను ప్రకటించింది. స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదంతో భక్తుల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా, భక్తిమయంగా మలిచేందుకు ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గ్రూపులుగా, గురుస్వాముల నేతృత్వంలో యాత్రకు వెళ్లే భక్తులకు పలు రాయితీలు, ఆర్థిక ప్రోత్సహకాలను అందిస్తోంది.

కనీసం 5 రోజుల వ్యవధికి బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వాములు, ఏజెంట్లు లేదా నిర్వాహకులకు ఏపీఎస్ఆర్టీసీ రూ. 2,000 కమిషన్ అందిస్తుంది. బస్సు సీటింగ్ సామర్థ్యానికి అదనంగా వంటవారు, మణికంఠలు, సహాయకులుగా ఉండే గరిష్ఠంగా 7 గురు వ్యక్తులకు ప్రయాణం పూర్తి ఉచితం.

బడ్జెట్‌కు అనుగుణంగా ఆర్టీసీ పలు రకాల బస్సులను అందుబాటులో ఉ...