భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి వివరాలను మంత్రి సభకు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్ 1,260, అసిస్టెంట్ లైన్మెన్ 1,084, లైన్మెన్ 22 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖలో ఏఈలు, లైన్ మెన్ల కొరత లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.