భారతదేశం, జూన్ 25 -- అదనపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడనుంది. తిరుమల వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

07819 చర్లపల్లి-తిరుపతి 25.06.2026, 27.06.2026 తేదీల్లో గురు, శనివారం రెండు సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ట్రైన్ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 07:30కి తిరుపతి చేరుకుంటుంది.

07820 తిరుపతి-చర్లపల్లి 26.06.2026, 28.06.2026 తేదీల్లో శుక్ర, ఆది వారాల్లో 2 సర్వీసులు నడుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4:30కి చర్లపల్లికి చేరుకుంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబా...