ఏటీఎఫ్, కమర్షియల్ ఎల్పీజీ ధరల పెంపు
భారతదేశం, సెప్టెంబర్ 1 -- అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు విమాన ఇంధనం (ఏటీఎఫ్), కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. సెప్టెంబరు 1 నుంచి ఈ నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. విమాన ఇంధనం లీటరుకు 5.46 శాతం పెరగ్గా, హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 9.50 చొప్పున పెరిగింది. అయితే, ఇళ్లలో వాడే గృహావసర ఎల్పీజీ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.
చమురు కంపెనీలు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశీయ విమానయాన సంస్థలకు సరఫరా చేసే ఏటీఎఫ్ ధర లీటరుకు రూ. 6.28 (5.46 శాతం) పెరిగి రూ. 121.28కి చేరింది. అంతకుముందు ఆగస్టు 1న కూడా లీటరుపై రూ. 5 చొప్పున పెంచారు. వరుసగా రెండు నెలల పాటు పెరిగిన ఈ ధరలు విమానయాన సంస్థలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. ఎయిర్‌లైన్స్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.