భారతదేశం, అక్టోబర్ 22 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంతో డేటా సెంటర్ల నిర్మాణం వేగవంతం కావడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన విద్యుత్ అవసరాలు అంతర్జాతీయ లోహ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లండన్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ 'వుడ్ మెకెంజీ' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కాపర్ (రాగి), అల్యూమినియం, నికెల్, లిథియం వంటి వ్యూహాత్మక లోహాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గనుల నుంచి తోడే ఉత్పత్తి ప్రక్రియ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం సాగకపోవడంతో భవిష్యత్తులో లోహాల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుల సామర్థ్యం 250 గిగావాట్లకు (GW) పైగా చేరింది. ఇది గతేడాదితో పోలిస్తే మూడింతలు ఎక్క...