భారతదేశం, మార్చి 20 -- టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (AI) విప్లవం కొత్త పుంతలు తొక్కుతుంటే, మరోవైపు అదే ఏఐ సామాన్యుల ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. తాజాగా ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ 'క్రిప్టో.కామ్' (Crypto.com) తన సిబ్బందిలో 12 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

క్రిప్టో.కామ్ సీఈఓ క్రిస్ మార్జాలెక్ ఈ లేఆఫ్స్‌పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదిక 'X'లో కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము సంస్థ అంతటా ఏఐని అనుసంధానిస్తున్నాం. ఈ మార్పును తక్షణం స్వీకరించని కంపెనీలు భవిష్యత్తులో విఫలమవుతాయి. నెమ్మదిగా కదిలే సంస్థలు వెనుకబడిపోతాయి. ఈ కొత్త ప్రపంచానికి అలవాటు పడలేని పాత్రలను (Roles) మేము తొలగిస్తున్నాం" అని క్రిస్ మార్జాలెక్ స్పష్టం చేశారు.

ప్ర...