భారతదేశం, అక్టోబర్ 16 -- సొంతింటి కల నెరవేర్చుకుని గృహ రుణం చెల్లిస్తున్న వారికి, రుణ గ్రహీతలకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చేదు వార్త వినిపించింది. తన బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 15, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.

ఈ సవరణతో ఎస్బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేట్ (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం ఉన్న 7.90 శాతం నుంచి 8.15 శాతానికి చేరింది. దీనికి అదనంగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ), బిజినెస్ స్ట్రాటజీ ప్రీమియం (బీఎస్పీ) తోడవుతాయి. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐ ఇచ్చే గృహ రుణాలు అన్నీ 8.15 శాతం ప్రాథమిక ఈబీఎల్ఆర్‌తో అనుసంధానమై ఉంటాయి. రుణగ్రహీత క్రెడిట్ స్కోరు, ఇతర అర్హతల ఆధారంగా తుది వడ...