భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌లో నెలకు రూ.10,000 ఎస్‌ఐపీ (సిప్) అని టైప్ చేసి, 20 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకోగానే తెరపై కనిపిచే భారీ అంకెల చూసి మదుపరులు సంబరపడిపోతుంటారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి నెలా ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెడితే కోట్లలో రాబడి వస్తుందని ఈ క్యాలిక్యులేటర్లు లెక్కిస్తాయి. అయితే నిజ జీవితంలో వంద శాతం ఈ అంచనాలు ప్రతిబింబించవని, దీని వెనుక పెద్ద వ్యత్యాసం ఉందంటూ డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ తన 2026 సెప్టెంబరు 'నేత్ర' (Netra) నివేదికలో స్పష్టం చేసింది.

ప్రతి నెలా స్థిరంగా రూ.10,000 మదుపు చేయవచ్చనే అంచనాతోనే సాధారణ క్యాలిక్యులేటర్లు పనిచేస్తాయి. కానీ నేడు మనం ఎంతో సులభంగా చెల్లించగలిగే రూ.10,000 మొత్తం.. 20 ఏళ్ల క్రితం సగటు భారతీయుడికి చాలా పెద్ద భారం.

డీఎస్పీ విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం రూ.10,000 అనేది సగటు భారతీ...