భారతదేశం, జూలై 1 -- ఆంధ్రప్రదేశ్‌లోని డీమ్డ్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్(UG) కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్' (PMS-RTF) ప్రయోజనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ విధానంలో ఈ పథకాన్ని విస్తరిస్తూ జీవో జారీ చేశారు. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల పంపిణీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు భరిస్తుండగా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాను పీ4 చొరవ ద్వారా స్పాన్సర్ల భాగస్వామ్యంతో సమకూరుస్తారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుండగా, మిగిలిన 25 శాతం రాష్ట్ర వాటాను పీ4 మోడల్ ద్వారా సేకరిస్తారు.

విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ పారదర్శకంగా అందేందుకు ...