భారతదేశం, జూలై 19 -- తెలంగాణలో ఎల్‌ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనపడటంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సకాలంలో భారీ వర్షాలు పడతాయని ఆశించిన రైతన్నల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాల మట్టాలు రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించే స్థిరమైన, లాభదాయకమైన సాగు పద్ధతుల వైపు మళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఈ తీవ్ర నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులను ఆదుకునేందుకు సరికొత్త ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రంగంలోకి దించింది. తక్కువ నీటి వినియోగంతో పాటు నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే పంటలను ఎంచుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోం...