భారతదేశం, జూన్ 13 -- దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ చేదువార్త చెప్పింది. ఈక్వటోరియల్ పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్‌నినో' (El Niño) ప్రభావం మొదలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ధృవీకరించింది. రాబోయే రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

తాజాగా విడుదల చేసిన ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్ (ENSO), ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) బులెటిన్ ప్రకారం.. కేంద్ర పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిమితిని దాటేశాయి. సముద్రపు నీరు వేడెక్కడానికి అనుగుణంగా వాతావరణంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్రం, వాతావరణం కలిసికట్టుగా ఎల్‌నినో లక్షణాలను ప్రదర్శిస్తున్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. జపాన్ వాతావరణ సంస్థ కూడా రెండు రోజుల క్రి...