ఎల్నినో ఎఫెక్ట్.. 45 రోజుల్లో చేతికి వచ్చేలా శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు.. వారికి బాధ్యతలు
భారతదేశం, అక్టోబర్ 15 -- తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడే పశుగ్రాసం కొరతను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటల పరిధిలోని శిఖం భూముల్లో పశుగ్రాసాన్ని సాగు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్లో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ముందస్తు చర్యల ప్రణాళికను ఖరారు చేశారు.
నీటి లభ్యత ఉన్న చెరువులు, జలాశయాల సమీపంలో ఉన్న 5 నుంచి 10 ఎకరాల శిఖం భూములను ఈ సాగు కోసం వినియోగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పశుగ్రాసం కొరత తీవ్రం కాకుండా ఉండటానికి రాబోయే 45 రోజుల్లో పంట చేతికి వచ్చేలా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.
ఈ మొత్తం ప్రాజెక్టు నిర్వాహణ బాధ్యతలను గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) అప్పగించారు. విత్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.