భారతదేశం, అక్టోబర్ 30 -- పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ), ఎరువుల కొరత ఏర్పడుతోందంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నన్ను బద్నాం చేయడమే లక్ష్యంగా విపక్షాలు ఈ వదంతులు సృష్టించాయని, దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సంబరపడటం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గుజరాత్‌లోని బనాస్‌కాంత జిల్లా భిల్డీలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

"ఇరాన్ యుద్ధం తర్వాత రైతులకు ఎరువులు అందవని, ప్రజలకు ఎల్పీజీ దొరకదని కొందరు కావాలనే పుకార్లు వ్యాప్తి చేశారు. మోదీ ప్రతిష్టను దిగజార్చడమే వారి ఏకైక అజెండా. నా జీవితపు చివరి క్షణం వరకు దేశ ప్రజల సేవలోనే నిమగ్నమై ఉంటా," అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చ...