భారతదేశం, జూన్ 2 -- టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పారు. షోరూమ్‌లను తెరవడంపై మాత్రమే టెస్లాకు ఆసక్తి ఉందని అన్నారు. దేశంలో ఈవీల తయారీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు రూ.4,150 కోట్ల విలువైన భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇది ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే దీనిపై తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి మాట్లాడారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో టెస్లాకు ఆసక్తి లేదని, షోరూమ్‌లను ఏర్పాటు చేయడంపై మాత్రమే ఆసక్తి చూపుతోందని అన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే టెస్లా కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల ఎలక్ట్రిక్ కారు లభిస్తుందని ఆశించిన వారికి ఇది చేదు వార్త అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.