భారతదేశం, మే 18 -- గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) విధానం కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం అనేది కార్పొరేషన్ ప్రైవేటీకరణ కిందకు రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) స్పష్టం చేసింది. అలాగే.. కొన్ని వర్గాలలో ప్రచారంలో ఉన్న నివేదికలు తప్పుదోవ పట్టించేవని పేర్కొంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ప్రజలు, ఉద్యోగులలో నెలకొన్న అపోహలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 'పీఎం ఈ-బస్ సేవా పథకాన్ని' ప్రారంభించిందని కార్పొరేషన్ పేర్కొంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. జీసీసీ నమూనా తమ కార్పొరేషన్‌కు కొత్తేమీ కాదని ఏపీఎస్ఆర్టీసీ వివరించింది.

కేంద్రం ఫేమ్-II పథ...