భారతదేశం, ఆగస్టు 23 -- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

శనిగరం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా కింద రూ.1.57 కోట్లు, రైతు రుణమాఫీ కింద రూ.4.54 కోట్లు, గృహజ్యోతి కింద 997 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ప్రయోజనం అందించినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామంలోని అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి, శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్‌పామ్ సాగు, జలసిరి, స్టీల్ బ్యాంకులు, మహిళా సంఘాల బలోపేతం, విద్యార్థులకు క...