ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బిగ్ షాక్ - ఫిరాయింపు కేసులో అనర్హత వేటు వేసిన హైకోర్టు
భారతదేశం, సెప్టెంబర్ 18 -- రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సభ్యత్వంపై న్యాయస్థానం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ కీలక తీర్పును వెలువరించింది.
గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతిపక్షాల వాదనలతో ఏకీభవించి వారి పిటిషన్లను పునఃసమీక్షించి ఆమోదించింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.