భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు ఎన్‌ఎస్‌ఈ కీలక సమాచారం అందించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) తన ప్రీ-ఓపెన్ సెషన్ కోసం సవరించిన నూతన నిబంధనలను ఈరోజు (సెప్టెంబరు 7) నుంచి అమలులోకి తీసుకొచ్చింది. మార్కెట్ ప్రారంభ వేళల్లో ఎలాంటి మార్పూ లేదు. అయితే, ప్రీ-ఓపెన్ సమయంలో ఆర్డర్లు నమోదు చేసే విధానంలో ఎన్‌ఎస్‌ఈ పలు కీలక సవరణలు చేసింది.

స్టాక్ మార్కెట్లో పారదర్శకతను పెంచడం, క్యాష్, డెరివేటివ్స్ విభాగాల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి 9:15 గంటల వరకు సాగే 15 నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్‌ను ఇప్పుడు నాలుగు స్పష్టమైన దశలుగా విభజించారు:

ఉదయం 9:00 నుంచి 9:05 వరకు (తొలి దశ): ఇన్వెస్టర్లు లిమిట్ ఆర్డర్లతో పాటు మార్కెట్ ఆర్డర్...