భారతదేశం, అక్టోబర్ 28 -- హైద‌రాబాద్‌ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వల‌ను ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తూ ఉండాల‌ని చెప్పారు. క్యూర్ పరిధిలో మంచినీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్‌హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్‌లో ముఖ్యమంత్రి స‌మీక్ష నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భ‌విష్యత్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ప్రాంత పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు(STP) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాల‌ని ఆదేశించారు. సచివాలయంతో పాటు సీఎంఓ, అవుట‌ర్ రింగ్, మెట్రో రైల్, ఇత‌ర శాఖ‌ల‌ కార్యాల‌యాల్లో...