భారతదేశం, మే 2 -- నీట్ యూజీ పరీక్ష నేప‌థ్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న అపారమైన గౌరవం, ఆ వృత్తిపై ఉన్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకోవాలని చూస్తున్న కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మీ పిల్లలకు నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని లేదా ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చని నమ్మబలికే దళారుల మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు.

'గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాల వల్ల ఎందరో తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుని, విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయ...