భారతదేశం, ఏప్రిల్ 24 -- సూర్యుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. బయటకు వెళ్లాలంటే.. వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకీ వేడి పెరుగుతుండటంతో ఉదయం 9 గంటలకే సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే చాలా మంది ఆఫీసులకు వెళ్లేవారి, అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక గిగ్‌వర్కర్ల పరిస్థితి దారుణం. బస్సుల్లో వెళ్లినా ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఇక ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మండుటెండలో బైక్ నడుపుతూ.. ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోవడం చెప్పలేని బాధ.

ఇంతటి తీవ్రమైన వేడిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. డీహైడ్రేషన్, తీవ్రమైన అలసట, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందువల్ల ఎండలో బైక్ నడుపుతున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.

అన్న...