భారతదేశం, ఆగస్టు 29 -- హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ తమ శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి బేగ్‌ను తొలగిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటన విడుదల చేసింది. ఈ హఠాత్ పరిణామానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏఐఎంఐఎం తన అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకుంది. ఈ ప్రకటన ఆధారంగా, మీర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని తెలిపింది. శాసనమండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఏఐఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ మాట్లాడు...