భారతదేశం, జూన్ 23 -- ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో దాదాపు 80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, వాటన్నింటికీ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ సమావేశంలో వ్యూహాత్మక అడుగులు పడ్డాయి.

రాష్ట్రంలో ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు వీలుగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సిఫార్సు చేసిన దాదాపు రూ.34,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35,000 మంది యువతకు నూతన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమలు, సమాచార సాం...