భారతదేశం, మే 31 -- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ఉచిత ప్రమాద బీమా (Free Accident Insurance) పథకం వేలాది కుటుంబాలకు చీకటిలో వెలుగులు నింపుతోంది. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున.. గత రెండేళ్లలోనే 40 బాధితుల కుటుంబాలకు దాదాపు రూ. 41 కోట్ల రూపాయల బీమా సొమ్మును సంస్థ విజయవంతంగా పంపిణీ చేసింది.

సింగరేణి ఉద్యోగులు కార్పొరేట్ శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రమాద బీమా పథకం కింద 1.25 కోట్ల రూపాయలను అందిస్తున్నాయి. ఇలా 2024లో ఈ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన మొదటి సంస్థగా సింగరేణి నిలిచింది. ఈ ఉచిత బీమా పథకం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, బాధితులకు నిజమైన ఆర్థిక భరోసాగా నిలిచింది అనడానికి ఈ రెం...