భారతదేశం, అక్టోబర్ 2 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లిస్తారు.

ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితులపై డాక్టర్ బీఆ...