భారతదేశం, మే 26 -- SCR Weekly Train kacheguda Sri Ganganagar : ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం, గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన కాచిగూడ - శ్రీగంగానగర్ వీక్లీ స్పెషల్ రైలు సర్వీసును రైల్వే మంత్రిత్వ శాఖ క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

రైలు నెంబర్ 07053/07054 తో నడిచిన వీక్లీ స్పెషల్ రైలు షెడ్యూల్‌ను మార్చారు. రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ టైమ్ టేబుల్‌ను విడుదల చేశారు. ఈ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు రానున్న జూలై నెల నుంచి పట్టాలెక్కనున్నాయి.

ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా పంజాబ్/హర్యానా సరిహద్దుల్...