భారతదేశం, అక్టోబర్ 14 -- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాద్‌ మహానగర పరిధిలో భూముల విలువ వందల కోట్లు ఎకరం ఉన్నప్పటికీ, పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన ఇండ్లు విషయంలో పేద ప్రజల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేటాయింపు, నిర్ణయం జరగలేదని ఆరోపించారు.

'ఈ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చే విషయంలో బేషజాలకు పోలేదు. క...