ఉగ్రరూపం దాల్చుతున్న వంశధార, నాగావళి... ఉత్తరాంధ్రకు వరద ముప్పు! హెచ్చరికలు జారీ
భారతదేశం, సెప్టెంబర్ 25 -- రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదవడంతో ప్రధాన నదులైన వంశధార, నాగావళి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు వేగంగా నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
పరిస్థితి తీవ్రతపై అధికారులు స్పందిస్తూ.. "ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వంశధార, నాగావళి నదుల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఈ సమయంలో ఈతకు వెళ్లడం కానీ, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.