భారతదేశం, జూన్ 19 -- Raakh Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో అత్యంత క్రూరమైన విలన్ 'బాబు' పాత్రలో నటించిన యంగ్ యాక్టర్ ఆకాష్ మఖిజా తన నటనతో దేశవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్నాడు.

అయితే ఈ క్యారెక్టర్‌కు వస్తున్న విపరీతమైన రెస్పాన్స్ కారణంగా ఆకాష్ మఖిజాకు ఇప్పుడు నిజ జీవితంలో ఊహించని తలనొప్పులు మొదలయ్యాయి. ప్రేక్షకులు ఈ పాత్రను ఎంతలా అసహ్యించుకుంటున్నారంటే, ఏకంగా నటుడికి చంపేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

రీసెంట్‌గా జూమ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆకాష్ మఖిజా మాట్లాడు...