భారతదేశం, జూన్ 25 -- ప్రయాణికుల డిమాండ్‌లో నిరంతర పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, షాలిమార్, చర్లపల్లి వంటి కీలక గమ్యస్థానాలను కలిపే అనేక వేసవి ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను భారతీయ రైల్వే పొడిగించింది. అదనపు ట్రిప్పులు నడుపుతోంది. దీంతో మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. సమ్మర్‌ ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.

ట్రైన్ నెంబర్ 02811 భువనేశ్వర్-యశ్వంతపూర్ రైలు జూలై 4 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు నడవనుంది. మెుత్తం 9 సర్వీసులు నడుస్తాయి. ప్రతీ శనివారం ఉంటుంది.

02812 నెంబర్ ట్రైన్ యశ్వంతపూర్-భువనేశ్వర్ మధ్య ప్రతీ సోమవారం జూలై 6 నుంచి ఆగస్టు 31 మధ్య తొమ్మిది సర్వీసులు నడుపనుంది.

08581 ట్రైన్ విశాఖపట్నం-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య జూలై 3 నుంచి జూలై 31 వరకు ప్రతీ శుక్రవారం నడుస్తాయ...