భారతదేశం, మే 28 -- వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ ప్రాంతాల మధ్య వన్-వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు అన్నీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయి. ఈ వన్-వే ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసులు, స్టాప్‌ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

విశాఖపట్నం-కాచిగూడ ట్రైన్ 30.05.2026వ తేదీన విశాఖలో బయల్దేరుతుంది. విశాఖపట్నంలో సాయంత్రం 05:30 గంటలకు ప్యాసింజర్ బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజ్‌గిరి స్టేషన్లలో ఆగుతుంది.

బిలాస్‌...