భారతదేశం, జూన్ 2 -- వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (APSWREIS) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం జూన్ 8, 2026 (సోమవారం) నాడు ప్రత్యేక స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ప్రవేశ పరీక్ష రాసినవారు, రాయలేకపోయినవారు సీటు లభించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ కడప జిల్లా సమన్వయ అధికారి ఎ.ఉదయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం వైఎస్ఆర్ కడప జిల్లాలోని చిన్నచౌక్ వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల వేదికగా జరుగుతుంది. ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే బాలబాలికలకు వేర్వేర...