భారతదేశం, జూలై 6 -- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని 11 ఐసీడీఎస్(ICDS) ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 178 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జులై 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే ఆరు జిల్లాల్లో ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా కొత్తగూడెం జిల్లాలో ఈ నోటిఫికేషన్ వెలువడింది. మిగిలిన జిల్లాల్లోనూ విడతల వారీగా త్వరలోనే విడివిడిగా నోటిఫికేషన్లు రానున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల...