భారతదేశం, మే 23 -- హిందూ సంప్రదాయంలో, వాస్తు శాస్త్రంలో తాబేలుకు చాలా ప్రముఖమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని మోయడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారం రూపం ధరించారు. క్షీరసాగర మథనానికి తాబేలు ఆధారం కావడం, దాని నుండే లక్ష్మీదేవి జన్మించడం వల్ల, ఎక్కడ తాబేలు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. అందుకే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల విష్ణుమూర్తి, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని వాస్తు నిపుణులు, పండితులు చెబుతుంటారు.

ఇళ్లలో, కార్యాలయాలలో స్ఫటిక తాబేళ్లను ఉంచడం ఒక కొత్త పోకడగా మారింది. స్ఫటికాలకు సహజంగానే ప్రతికూల శక్తిని గ్రహించి, సానుకూల శక్తిని విడుదల చేసే గుణం ఉంటుంది. ఇంట్లో నిరంతర గొడవలు, మానసిక అశాంతి, ఆర్థిక సమస్యలు ...