భారతదేశం, జూన్ 15 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో(KGBVs) విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పబ్లిక్ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఒక సమగ్ర విద్యా కార్యాచరణ ప్రణాళికను విద్యాశాఖ రూపొందించింది. ఈ ప్రతిష్టాత్మక విద్యా ప్రణాళికకు 'విజయపథం' అని నామకరణం చేశారు.

'నేర్చుకోవడమే లక్ష్యం - విజయమే గమ్యం'(Learning is the Goal - Success is the Destination) అనే బలమైన నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, 590కి పైగా మార్కులు సాధించే విద్యార్థినుల సంఖ్యను గణనీయంగా పెంచడం, రాష్ట్రవ్యాప్త ర్యాంకింగ్స్‌లో కేజీబీవీల స్థానాన...