భారతదేశం, సెప్టెంబర్ 23 -- కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియతో పాటు పలు కీలక అంశాల్లో తమకు సమాచారం ఇవ్వకుండా చీకటిలో ఉంచారని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినట్లు వచ్చిన మీడియా నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనం ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ సోషల్ మీడియా వేదికగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను 'భారత శత్రువు'గా అభివర్ణిస్తూ అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఓటర్ల జాబితా నుంచి దాదాపు 12 కోట్లకు పైగా పేర్లను తొలగించారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 97 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 12.4 శాతానికి సమానం. ...