భారతదేశం, మే 20 -- ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్‌ పూలింగ్‌ను ప్రోత్సహించడంతోపాటు పెట్రో...