భారతదేశం, అక్టోబర్ 1 -- దేశంలో ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై విపక్ష 'ఇండియా' కూటమి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఓటర్ల సంక్షిప్త నిఘా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈవీఎంల స్థానంలో పాత బ్యాలెట్ పేపర్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ పోరాటానికి సమరశంఖం పూరించింది.

దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో 19 ప్రతిపక్ష పార్టీల నాయకులు, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ సుమారు మూడున్నర గంటల పాటు సమావేశమై భవిష్యత్ వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో ఈవీఎంల స్థానంలో కాగితపు బ్యాలెట్లను తీసుకురావాలనే ప్రతిపాదనకు అన్ని పార్టీలు వంద శాతం ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు...